Ganguly: గంగూలీని ప్రైవేట్ రూమ్ కు తరలించిన వైద్యులు

Ganguly shifted to private room from CCU
  • గంగూలీ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
  • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • యాంజియోప్లాస్టీ విజయవంతమైందని ప్రకటన
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రైవేట్ రూమ్ కు తరలించామని చెప్పారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ అఫ్తాబ్ ఖాన్, డాక్టర్ అశ్విన్ మెహతాలు గంగూలీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని బులెటిన్ లో పేర్కొన్నారు. గంగూలీకి నిన్న రెండోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ తో పాటు డాక్టర్ అశ్విన్ మెహతా, డాక్టర్ దేవి షెట్టి, డాక్టర్ అజిత్ దేశాయ్, డాక్టర్ సరోజ్ మోండల్, డాక్టర్ సప్తర్షి బసులు గంగూలీకి నిన్న యాంజియోప్లాస్టీ నిర్వహించారని బులెటిన్ లో పేర్కొన్నారు. యాంజియోప్లాస్టీ విజయవంతం అయిందని చెప్పారు. రెండు స్టెంట్లను వేశామని తెలిపారు. గంగూలీ ప్రస్తుతం పూర్తి అబ్జర్వేషన్ లో ఉన్నారని తెలిపారు.
Ganguly
BCCI
Health Bulletin

More Telugu News