Manchu Vishnu: సీఎం జగన్ దంపతులతో హీరో మంచు విష్ణు, వెరానికా లంచ్ మీటింగ్

Hero Manchu Vishnu and his wife Viranika goes to CM Jagan camp office
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మంచు విష్ణు దంపతులు
  • విష్ణు, విరానికాలకు ఆతిథ్యమిచ్చిన సీఎం జగన్, భారతి
  • కుటుంబ పరమైన విషయాల చర్చ!
  • విరానికా కారణంగా వైఎస్ కుటుంబంతో మంచువారికి బంధుత్వం
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, ఆయన అర్ధాంగి విరానికా రెడ్డి ఈ మధ్యాహ్నం సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మంచు విష్ణు, విరానికా దంపతులు సీఎం నివాసంలోనే భోజనం చేసినట్టు తెలుస్తోంది. వీరి భేటీకి గల కారణాలు తెలియరాలేదు. పూర్తిగా కుటుంబ పరమైన సమావేశం అని తెలుస్తోంది.

కాగా, మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి, సీఎం జగన్ కజిన్స్ అన్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధాకర్ రెడ్డి కుమార్తే విరానికా రెడ్డి. మంచు విష్ణు... కొన్నాళ్ల కిందట విరానికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మంచువారికి వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది.
Manchu Vishnu
Viranka Reddy
Jagan
YS Bharathi
Tadepally

More Telugu News