Delhi: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు

  • పేవ్ మెంట్ పై ఐఈడీ ఉన్న బ్యాగును వదిలి వెళ్లిన దుండగులు
  • అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్రపతి, ప్రధాని
  • పేలుడు ప్రాంతంలో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు
Blast near Israel Embassy in Delhi

ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఎదుట పేలుడు సంభవించింది. కాసేపటి క్రితం ఈ పేలుడు సంభవించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎంబసీ భవనం ఉన్న పేవ్ మెంట్ పై ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసున్న నాలుగు కార్ల అద్దాలు బద్దలయ్యాయి.

అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అబ్దుల్ కలాం రోడ్డు మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది.

ఐఈడీ (పేలుడు పదార్థాలు) ఉన్న బ్యాగును పేవ్ మెంట్ పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. పేలుడు సంభవించిన ప్రాంతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న 'బీటింగ్ ది రిట్రీట్ సెరమొనీ' జరుగుతున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News