జన్మనిచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి

29-01-2021 Fri 15:42
  • ఇవాళ కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు
  • హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ చిరంజీవి స్పందన
  • ట్విట్టర్ లో మ్యూజికల్ వీడియో పంచుకున్న వైనం
  • అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో
Chiranjeevi convey birthday wishes to mother Anjana Devi
ఇవాళ తన మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జన్మనిచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తల్లితో అనుబంధాన్ని స్మరించుకుంటూ ఓ మ్యూజికల్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో అంజనా దేవి కలిసి ఉన్నప్పటి ఫొటోలను చూడొచ్చు. హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ చిరంజీవి చేసిన ఈ పోస్టు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.