Shruti Haasan: అందమైన ఫొటోతో శ్రుతిహాసన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన ప్రియుడు

Shruti Haasans boy friend sends her special birthday message
  • శాంతను హజారిక ప్రేమలో ఉన్న శ్రుతి 
  • నిన్న 35వ పుట్టినరోజు సెలెబ్రేషన్ 
  • ప్రియుడికి థ్యాంక్స్ చెప్పిన ముద్దుగుమ్మ 
అందాలభామ శ్రుతిహాసన్ నిన్న 35వ పుట్టినరోజును జరుపుకుంది. ముంబైలో తన బర్త్ డే వేడుకలను జరుపుకుంది. ఈ పార్టీలో ఆమె ప్రియుడు శాంతను హజారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వేడుకకు ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా శ్రుతి పంచుకుంది. తన ప్రియుడిని కౌగిలించుకున్న ఫొటోను కూడా షేర్ చేసింది.

 'నా పుట్టిరోజును మరింత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ తన ప్రియుడిని ఉద్దేశించి ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పెట్టింది. తన జీవితంలో ఈ ఘడియలు చాలా ముఖ్యమైనవని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. డూడుల్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన శాంతను... గౌహతి ఆర్ట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. శ్రుతికి శాంతను సోషల్ మీడియా ద్వారా కూడా గ్రీటింగ్స్ చెప్పాడు. 'హ్యాపీ బర్త్ డే మై లవ్' అంటూ విష్ చేశాడు.
Shruti Haasan
Boy Friend
Lover
Tollywood
Bollywood
Kollywood

More Telugu News