Antarctica: ప్రపంచంలోనే పెద్ద మంచు కొండ.. ముక్కలైంది!

  • ఏ68ఏ నుంచి కొత్తగా ఏ68జీ ఏర్పాటు
  • ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన పరిశోధకులు
  • ఉష్ణోగ్రతల పెరుగుదల, సముద్రపు ఆటుపోట్లే కారణమని వెల్లడి
Split signals end for remnant of Antarctic iceberg A68a

ఏ68ఏ.. నిన్నటిదాకా ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండ అది. అంటార్కిటికాలోని ఆ మంచుకొండ వైశాల్యం 5,800 చదరపు కిలోమీటర్లు. కానీ, ఇకపై కాదు. ఆ మంచు కొండ రెండు ముక్కలైంది. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. కారణం, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే. ఆ వేడి ప్రభావం వల్లే ఏ68ఏ విరిగిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అందులోని ఓ ముక్క బ్రిటన్ లోని దక్షిణ జార్జియా వైపునకు కదులుతోందని పరిశోధకులు గుర్తించారు. ఏ68జీ అనే ఓ కొత్త ముక్క ఏర్పడినట్టు ఉపగ్రహాల చిత్రాల ద్వారా తేల్చారు. గురువారం దాకా ఏ68ఏ నుంచి ఆరు ముక్కలు మాత్రమే ఉండేవి. ఏ68ఎఫ్ వరకు అవి విరిగిపోయాయి. ఇప్పుడు వాటికి ఏ68జీ జత కలిసింది.

మంచు కొండ విరిగిపోయే క్రమం ఆధారంగా ఆ ముక్కలకు పేర్లు పెడతారు. అంటార్కిటికా అని వచ్చేలా అందులో నుంచి వేరుపడిన ఓ పెద్ద ముక్కకు.. పేరు ముందు ‘ఏ’ని పెడతారు. మధ్యలో సంఖ్యను.. ఖండం నుంచి విడిపోయిన ఓ ప్రధాన/పెద్ద ముక్కల క్రమం. అంటే ఈ ముక్క.. 68వది. మామూలుగా అయితే దీనిపేరు ఏ68.

దాని నుంచి మళ్లీ వేర్వేరు ముక్కలు ఏర్పడుతున్నాయి కాబట్టి.. ఏ68ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ గా నామకరణం చేశారు. ఆ జాబితాలోనే కొత్తగా ఏ68జీ వచ్చి చేరింది. అయితే, దీనిని ఐస్ కొండలకు నామకరణం చేసే అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ ధ్రువీకరించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News