Road Accident: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Fatal road accident in Mahbubnagar district
  • మర్రిమిట్ట వద్ద ఆటో, లారీ ఢీ
  • నుజ్జునుజ్జయిన ఆటో
  • శుభకార్యానికి వెళుతుండగా ఘటన
  • ఆరుగురి మృతి
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం
మహబూబాబాద్ జిల్లాలో రహదారి రక్తసిక్తమైంది. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.

ఇక ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారని, వరంగల్ లో ఓ శుభకార్యానికి ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా కన్నుమూశాడు. ఆటో నుజ్జునుజ్జవడం ప్రమాద తీవ్రతను వెల్లడిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు.
Road Accident
Marrimitta
Auto
Lorry
KCR
Telangana

More Telugu News