Ambati Rambabu: సీఎంగా చంద్రబాబును నియమించాలని నిమ్మగడ్డ లేఖ రాసినా ఆశ్చర్యం లేదు!: అంబటి రాంబాబు

Ambati sensational comments on SEC Nimmagadda Ramesh
  • ప్రభుత్వంలోని పెద్దలపై గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు 
  • పలువురు అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు 
  • పిచ్చిముదిరిందిన్న అంబటి
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో తనపై విమర్శలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఓ వైపు రమేశ్ చెపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దలపై ఏకంగా గవర్నర్ కు హరిచందన్ కు ఫిర్యాదు కూడా చేశారు. పలువురు అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

అయినప్పటికీ వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎస్ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి.  పిచ్చిముదిరింది'  అని ట్వీట్ చేశారు.
Ambati Rambabu
YSRCP
Nimmagadda Ramesh
SEC
Chandrababu
Telugudesam

More Telugu News