Economy: ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 11%: ఆర్థిక సర్వేలో అంచనా

  • V ఆకార అభివృద్ధి నమోదవుతుందన్న అంచనాలు
  • కరోనా టీకా పంపిణీతో గాడిలో ఆర్థిక రంగం
  • ద్రవ్యోల్బణం 15.4%గా రికార్డ్
  • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికం
Economic Survey likely to predict 11 percent economic growth this fiscal

కేంద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. అంతకుముందే దేశ ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక సర్వేను విడుదల చేస్తుంది. ఆ సర్వేలో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 11 శాతంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం.

లక్షా 53 వేల 847 మందిని బలిగొన్న కరోనాకు వ్యాక్సిన్ ను తీసుకురావడం, ఇప్పటికే చాలా మందికి టీకాను వేయడం వంటివి.. దేశ ఆర్థిక పునరుత్తేజానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 1991లో ఆర్థిక వ్యవస్థను లిబరలైజ్ చేసిన తర్వాత.. ఇన్నేళ్లకు ఆర్థిక వృద్ధి ఘనంగా నమోదవుతుందని పేర్కొన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే, జీడీపీ మాత్రం ఓ మోస్తరుగా ఉంటుందని సర్వేలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం 15.4 శాతం పెరుగుతుందని చెప్పినట్టుగా సమాచారం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధిక ద్రవ్యోల్బణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ‘V ఆకార (వేగంగా పడి, వేగంగా లేచిన)’ అభివృద్ధిని అంచనా వేసిందని చెబుతున్నారు.

More Telugu News