fake news: త‌ప్పుడు వార్త ట్వీట్ చేసిన ఎడిటర్ రాజ్‌దీప్.. రెండు వారాల స‌స్పెన్ష‌న్ వేటు.. నెల జీతం కోత‌

  • రైతుల ట్రాక్ట‌ర్ల ర్యాలీలో ఒక‌రి మృతి
  • పోలీసుల కాల్పుల వ‌ల్ల మృతి అంటూ ట్వీట్
  • మండిప‌డ్డ నెటిజ‌న్లు
  • రాజ్‌దీప్‌పై ఇండియా టుడే యాజ‌మాన్యం చ‌ర్య‌లు
netizens slams rajdeep for posting fake news

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన  కొత్త‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల ర్యాలీతో రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున‌ నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ ఆందోళ‌న‌ల‌పై సీనియర్‌ జర్నలిస్టు, ఇండియా టుడే క‌న్స‌ల్టింగ్ ఎడిట‌ర్  రాజ్‌దీప్‌ సర్దేశాయ్ చేసిన ట్వీట్లు ఆయ‌న‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.

పోలీసులకు, ఆందోళనకారులకు జ‌రిగిన‌ ఘర్షణ‌పూరిత‌‌ వాతావరణంలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన విష‌యంపై ఆయ‌న ట్వీట్ చేశారు.  పోలీసు కాల్పుల్లోనే నవనీత్ (45) మృతి చెందాడ‌ని, ఆయ‌న‌ త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు త‌న‌తో చెప్పారని రాజ్‌దీప్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.  

అయితే, ఆ తర్వాత పోలీసులు దీనిని ఖండించారు. ట్రాక్టర్‌ బోల్తాపడటంతో నవనీత్‌ మృతి చెందార‌ని స్ప‌ష్టం చేస్తూ, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. అంతేగాక‌, ట్రాక్ట‌ర్ పల్టీ కొట్టి తల పగలడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోయార‌ని పోస్ట్‌మార్టం నివేదిక కూడా స్ప‌ష్టం చేసింది.

దీంతో  తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో రాజ్‌దీప్‌ సర్దేశాయ్ తన ట్వీట్ ను డిలీట్‌ చేశారు. మ‌రో ట్వీట్ చేస్తూ ట్రాక్టర్‌ మీద ఉండగానే న‌వనీత్‌ను పోలీసులు కాల్చేశారని రైతులు ఆరోపించినట్లు అందులో పేర్కొంటూ త‌న త‌ప్పును క‌వ‌ర్ చేసుకునేలా వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో ఆయ‌న‌ బాధ్యతారాహిత్యంగా ట్వీట్లు చేశారంటూ ఇండియా టుడే గ్రూప్‌ ఆయనపై రెండు వారాల పాటు సస్పెన్ష‌న్ వేటు వేసింది. అంతేగాక‌, నెల వేత‌నం కోత విధించినట్లు  తెలుస్తోంది. రాజ్‌దీప్ తీరుపై నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

More Telugu News