Limca Book of Records: బూడిదతో గాంధీ బొమ్మ గీసి రికార్డులకెక్కిన ఆదోని యువకుడు!

  • కాగితాలను కాల్చి బూడిద
  • చేతి వేళ్లతో గాంధీ బొమ్మ చిత్రీకరణ  
  • గోల్డ్ మెడల్ పంపిన ఇండియా రికార్డ్స్ అధికారులు
Ash Art of Gandhi by Adoni Youth in Rocords

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ కళాకారుడు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. బూడిదను ఉపయోగించి, తన చేతి మునివేళ్లతో గాంధీ మహాత్ముని చిత్రాన్ని అత్యంత సహజంగా గీసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీకాంత్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు.

ఆదోని పట్టణ పరిధిలోని నారాయణ గుంతకు చెందిన శ్రీ వైష్ణవ శ్రీకాంత్, ఎంబీయే చదివి చెన్నైలో పనిచేస్తున్నాడు. కాగితాలను కాల్చగా వచ్చిన బూడిదతో, తన చేతి వేళ్లను వాడుతూ, గాంధీ బొమ్మను గీసిన శ్రీకాంత్, మొత్తం వీడియో తీసి, రికార్డులు నమోదు చేసే అధికారులకు పంపారు.

దీన్ని పరిశీలించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు, 2021-22 సంవత్సరానికి అత్యుత్తమ ఆర్ట్ గా దీన్ని గుర్తిస్తూ, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్ లో పంపారు. దీన్ని అందుకున్న శ్రీకాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

More Telugu News