Parliament: పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయాలపైనే చర్చలు జరగాలన్న ప్రధాని!

  • ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్ర‌సంగం
  • కాసేప‌ట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్ట‌నున్న నిర్మ‌లా సీతారామ‌న్‌
  • దేశానికి సంబంధించి ఈ దశాబ్దం చాలా కీలకమైందన్న మోదీ
  • 2020లో నాలుగైదు మినీ బడ్జెట్లను ప్ర‌వేశ‌పెట్టామ‌ని వ్యాఖ్య‌
 This Budget will be seen as part of those mini budgets says modi

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తోన్న‌ నేపథ్యంలో ఆయ‌న ప్ర‌సంగాన్ని దేశంలోని 18 పార్టీలు బ‌హిష్క‌రించాయి. కాసేప‌ట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెడ‌తారు.
 
అంత‌కు ముందు పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశానికి సంబంధించి ఈ దశాబ్దం చాలా కీలకమైందని, భార‌త‌ స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయాలపైనే చర్చలు జరగాలన్నారు. దేశ‌ చరిత్రలో గ‌త ఏడాది తొలిసారిగా నిర్మలా సీతారామన్ నాలుగైదు మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చిందని చెప్పారు.

కాగా, దేశంలో కరోనా వైరస్ విజృంభ‌ణ‌, ఆర్ధిక సంక్షోభ ప‌రిస్థితులు కొత్త‌ వ్యవసాయ చట్టాలపై ఈ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు నిల‌దీయ‌నున్నాయి. వ‌చ్చేనెల‌ 1న నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

More Telugu News