Reliance: రిలయన్స్ జియో మరో ఘనత.. అంతర్జాతీయంగా ఐదో ర్యాంకు!

  • టెలికం రంగంలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే అగ్రస్థానం
  • ‘గ్లోబల్ 500’ జాబితాను విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్
  • జియోపై ప్రశంసలు
Jio Emerges as Fifth Strongest Company in Brand Finance Global 500 list

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో ఘనత సాధించింది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన జియో.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లలో అయిదో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు ‘గ్లోబల్ 500’ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసింది. ఇందులో చైనాకు చెందిన ‘వియ్‌చాట్’ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పెరారీని వియ్‌చాట్ రెండో స్థానంలోకి నెట్టేసింది. రష్యాకు చెందిన ఎస్బర్ బ్యాంక్, కోకాకోలా మూడు నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి. జియో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

40 కోట్ల మంది వినియోగదారులతో జియో దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా, ప్రపంచంలో మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ప్రతిష్ఠ, మౌత్ పబ్లిసిటీ, కొత్తదనం, సేవలు, డబ్బుకు తగ్గ విలువ వంటి అంశాల్లో జియో మేటిగా నిలిచిందని ప్రశంసించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ కూడా ఇదేనని పేర్కొంది. 50 శాతం వృద్ధితో తన బ్రాండ్ విలువను 480 కోట్ల డాలర్లకు చేర్చుకుందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.

More Telugu News