Andhra Pradesh: ఏపీలో జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు

  • ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసిన ప్రభుత్వం
  • ప్రశ్న పత్రాలు ఏడుకు కుదింపు
  • వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసిన సర్కారు
10th exams Schedule released in AP

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ప్రాథమిక షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 7న పరీక్షలు ప్రారంభం కానుండగా 15న ముగుస్తాయి. ఫీజును ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 10లోగా చెల్లించాల్సి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫలితాలను జులై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

ఇప్పటి వరకు 11గా ఉన్న ప్రశ్న పత్రాలను ఈసారి  ఏడుకు కుదించారు. భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రంలో మరో పేపర్ ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉంటుంది. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పాఠశాలలు మూతపడడం వల్ల వేసవి సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం వంద రోజుల పదో తరగతి ప్రణాళికను సిద్ధం చేసింది.

More Telugu News