KTR: ’టి’ అనే పదమే కేసీఆర్ భిక్ష.. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి: కేటీఆర్ 

Minister KTR warns Bandi Sanjay and Uttam Kumar Reddy
  • మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది
  • కేసీఆర్ లేకుంటే మీకు పదవులెక్కడివి?
  • నోరు అదుపులో పెట్టుకోండి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వారిద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవాకులు చవాకులు పేలవద్దని హెచ్చరించారు. తమ సహనానికి ఓ హద్దు ఉంటుందని అన్నారు.

 అసలు ‘టి’ అనేదే కేసీఆర్ పెట్టిన భిక్ష అన్న సంగతిని గుర్తెరగాలన్నారు. కేసీఆర్ కనుక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోయి ఉంటే టీపీసీసీ, టీబీజేపీ పదవులెక్కడివని ప్రశ్నించారు. వారిద్దరూ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర సాధనకు ఉద్యమం చేసినట్టుగానే, ప్రతిపక్షాల కుట్రలను కూడా తిప్పికొట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు.
KTR
Telangana
Bandi Sanjay
Uttam Kumar Reddy

More Telugu News