Whatsaap: మరో సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకువస్తోన్న వాట్సాప్

  • వాట్సాప్ వెబ్ లాగిన్ కు మరింత భద్రత
  • వేలిముద్ర, ఫేస్ ఐడీ రికగ్నిషన్ తో కట్టుదిట్టం
  • ఒకరి వాట్సాప్ ఖాతాను మరొకరు పీసీతో లింక్ చేయకుండా ఏర్పాటు
  • ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉన్న ఫీచర్
Whatsapp brings new security feature for web login

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మరో సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇప్పటివరకు కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ లో లాగిన్ అయ్యేందుకు ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోయేది. అయితే, ఇప్పుడు భద్రతకు మరింత పెద్ద పీట వేస్తూ వాట్సాప్ తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ వెబ్ లో లాగిన్ అవ్వాలంటే వేలిముద్ర లేదా, ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. ఈ మేరకు వాట్సాప్ కొత్త ఫీచర్ కు రూపకల్పన చేసింది.

మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ ను కంప్యూటర్ లో వాట్సాప్ వెబ్ కు లింకు చేసేముందు, వేలిముద్ర లేదా, ఫేస్ ఐడీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాట్సాప్ వెబ్ లోకి ప్రవేశించాలి. ఒకరి వాట్సాప్ ఖాతాను మరొకరు కంప్యూటర్ కు లింక్ చేయకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ దశలోనే ఉంది.

More Telugu News