Challa Dharma Reddy: అయోధ్య రామాలయంపై మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

TRS MLA Challa Dharma Reddys sensational comments on Ayodhya temple
  • రామాలయం నిర్మాణంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యాఖ్యలు 
  • తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి
  • అయోధ్యలో కట్టే రామ మందిరం మాకెందుకని వ్యాఖ్య
అయోధ్య రామ మందిర నిర్మాణంపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాముడు మనకు అవసరమా? అంటూ ఇటీవలే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే తరహా వ్యాఖ్యలు చేసి వివాదానికి ఆజ్యం పోశారు.

తాజా వ్యాఖ్యలు చేసింది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. మనకు భద్రాచలంలో రాముడు లేడా? అని ధర్మారెడ్డి ప్రశ్నించారు. అయోధ్యలో కట్టే రామ మందిరం మాకెందుకు? అని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
Challa Dharma Reddy
TRS
Ayodhya Ram Mandir

More Telugu News