Petrol: ఇండియాలో తొలిసారిగా రూ.100 దాటిన పెట్రోల్ ధర!

  • రూ. 100 దాటిన ప్రీమియం పెట్రోల్ ధర
  • రాజస్థాన్ లో రూ. 101.15
  • సాధారణ పెట్రోల్ ధర రూ. 98.40కి చేరిక
First Time In India Rs 100 For Branded Petrol

భారత దేశ చరిత్రలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 100 మార్క్ ను తాకింది. నేడు రాజస్థాన్ లో ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయలు అధిగమించింది. నేడు చమురు సంస్థలు పెట్రోలు ధరను 25 పైసల మేరకు పెంచడంతో, ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ప్రీమియం పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది.

ఇక సాధారణ పెట్రోలు ధర దేశవ్యాప్తంగా రూ. 95 నుంచి రూ. 89 మధ్య కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.30గా ఉండగా, ముంబైలో రూ. 92.86కు చేరుకుంది. పెట్రోలు ధరలపై విలువ ఆధారిత పన్నులను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వత్రా విజ్ఞాపనలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీగంగానగర్ లో సాధారణ పెట్రోలు ధర రూ. 98.40 ఉండగా, ప్రీమియం ధర రూ. 101.15కు చేరుకుంది. ప్రీమియం పెట్రోల్ లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.

More Telugu News