నాన్న మరణం, ఐసోలేషన్.. ఈ రెండూ నన్ను తీవ్రంగా కుంగదీశాయి: సినీ నటి రాయ్ లక్ష్మి

28-01-2021 Thu 08:48
  • నోటి కేన్సర్‌తో గతేడాది మరణించిన రాయ్ లక్ష్మి తండ్రి
  • ప్రోగ్రాం కోసం దుబాయ్ వెళ్తే సోకిన కరోనా
  • తండ్రి మరణం తర్వాత జీవితంలో తెలియని వెలితి
 Dads death and isolation are severely crippled me says Raai Laxmi

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న సినీనటి రాయ్ లక్ష్మి జీవితంలో తానెదుర్కొన్న సంఘర్షణల గురించి తాజాగా వెల్లడించారు. నోటి కేన్సర్ కారణంగా గతేడాది తన తండ్రి మరణించడడం తనను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొన్నారు.

తండ్రి మరణం తనను బాగా బాధించిందని, ఒంటరితనంతో వెలితిగా అనిపించిందని తెలిపింది. దాని నుంచి బయటపడేందుకు నూతన సంవత్సరం సందర్భంగా దుబాయ్‌లో నిర్వహించే డ్యాన్స్ షోకు అంగీకరించి ఎంతో సంతోషంగా అక్కడకు వెళ్లానని, కానీ న్యూ  ఇయర్‌కు కొన్ని రోజుల ముందు తనకు కరోనా సోకిందని గుర్తుచేసుకున్నారు.

దుబాయ్ వెళ్లాక నీరసంగా అనిపిస్తే పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వాసన కూడా కోల్పోయానని పేర్కొన్న ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లానని చెప్పారు. ఐసోలేషన్ తనను మరింత కుంగదీసిందని వాపోయారు. 12 రోజుల తర్వాత చేసుకున్న పరీక్షల్లో నెగటివ్ రావడంతో తిరిగి బయట ప్రపంచంలో అడుగుపెట్టానని చెప్పుకొచ్చారు.