సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

28-01-2021 Thu 07:27
  • అనుపమ షార్ట్ ఫిలిమ్ కి మంచి రెస్పాన్స్ 
  • మీ నెలలో రానున్న ప్రభాస్ 'రాధే శ్యామ్'
  • విలన్ గా నటిస్తున్న ప్రముఖ దర్శకుడు  
Anupama Parameshvarans short film gets good response

*  మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల 'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' పేరిట రూపొందిన ఓ షార్ట్ ఫిలిమ్ లో నటించింది. దీని తెలుగు, మలయాళం వెర్షన్లను ఇటీవలే యూట్యూబ్ లో ప్రీమియర్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వెర్షన్ కి ఇప్పటికే 4.5 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి.
*  ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మీ నెలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు. అయితే, ఇప్పుడు ఏకంగా ఓ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు. తమిళ నటుడు శింబు హీరోగా రూపొందుతున్న 'పతుతల' అనే చిత్రంలో గౌతమ్ విలన్ గా నటిస్తున్నాడు.