Janasena: రేపు గవర్నర్ ను కలవనున్న జనసేన, బీజేపీ నేతలు

  • ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్న నేతలు
  • నిష్పాక్షిక ఎన్నికలు జరిపించాలని కోరనున్న వైనం
  • నాదెండ్ల మనోహర్, సోము వీర్రాజు నేతృత్వంలో ప్రతినిధి బృందం
Janasena and BJP leaders will meet AP Governor tomorrow

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన, బీజేపీ నేతలు రేపు ఉదయం రాజ్ భవన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల అంశంలో ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై జనసేన, బీజేపీ బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున సోము వీర్రాజు ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని, ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాదు, ఆన్ లైన్ లో నామినేషన్లు స్వీకరించేలా ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.

More Telugu News