ప్రజలకు కరోనా వస్తే నిమ్మగడ్డదే బాధ్యత అంటున్న అతి మేధావి విజయసాయిరెడ్డికి నాదొక సూటి ప్రశ్న: అయ్యన్న

27-01-2021 Wed 19:05
  • ఇప్పటివరకు 7,150 మంది కరోనాతో చనిపోయారన్న అయ్యన్న
  • అందుకు జగన్ బాధ్యత తీసుకుంటాడా అంటూ ప్రశ్నాస్త్రం
  • ప్రభుత్వం ఆదుకుంటుందా అంటూ ట్వీట్
  • నీ స్టేట్ మెంటులోనే భయం కనిపిస్తోందంటూ విమర్శలు
TDP leader Ayyanna Patrudu questions Vijayasai Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే నిమ్మగడ్డదే బాధ్యత అంటున్న అతి మేధావి విజయసాయిరెడ్డికి నాదొక సూటి ప్రశ్న అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,150 మంది మరణించారని, 8.87 లక్షల మంది కరోనాతో ఇబ్బందిపడ్డారని, మరి వీటన్నింటికి జగన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? అని ప్రశ్నించారు.

"మీ లెక్కల్లోనే ఇవి ప్రభుత్వ హత్యలు కాబట్టి మరణించిన 7,150 మంది కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థికసాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటుందా? ఎన్నికలకు భయపడడంలేదు అన్న నీ స్టేట్ మెంటులోనే భయం కనిపిస్తోంది" అంటూ విజయసాయిరెడ్డిని విమర్శించారు.