సౌరవ్ గంగూలీకి మరోసారి ఛాతీ నొప్పి... అపోలో ఆసుపత్రికి తరలింపు

27-01-2021 Wed 14:58
  • గుండె నొప్పితో బాధపడిన గంగూలీ
  • కోల్ కతాలో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • ఇదివరకే గంగూలీకి ఏంజియోప్లాస్టీ
  • ఇటీవలే కోలుకున్న వైనం
  • మరోసారి అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన
Sourav Ganguly once again suffered with chest pain and rushed to Apollo Hospital

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ మరోసారి ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. ఆయన ఈ మధ్యాహ్నం గుండె నొప్పితో బాధపడడంతో కుటుంబసభ్యులు కోల్ కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఇటీవలే గంగూలీ వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కోల్ కతా వుడ్ లాండ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ఆయనకు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్ లాండ్స్ వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం గంగూలీ కోలుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. ఆయన మరోసారి ఆసుపత్రిపాలవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.