శాంతియుత నిరసనలను గౌరవించాలి: ఐరాస​

27-01-2021 Wed 14:46
  • ఢిల్లీ హింసాత్మక ట్రాక్టర్ ర్యాలీపై స్పందన
  • సభ స్వేచ్ఛ, అహింసను దృష్టిలో పెట్టుకోవాలని సూచన
  • ప్రకటన విడుదల చేసిన యూఎన్ సెక్రటరీ జనరల్ వ్యక్తిగత ప్రతినిధి
Important To Respect Peaceful Protests UN

మంగళవారం ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం కావడంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. యూఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ వ్యక్తిగత ప్రతినిధి అయిన స్టెఫానీ డుజారిక్ దానిపై ప్రకటన చేశారు. రోజువారీ మీడియా సమావేశాల్లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఎక్కడైనా సరే శాంతియుతంగా జరిగే నిరసనలను గౌరవించాలని ఆయన సూచించారు. సభ స్వేచ్ఛ, అహింసను గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు.

ఢిల్లీ హింసపై ఇప్పటికే పోలీసులు 22 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ర్యాలీ హింసాత్మకం కావడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఆందోళనల్లో 41 రైతు సంఘాలకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించింది.