అధికారుల‌తో నిమ్మ‌గ‌డ్డ భేటీ.. హాజ‌రైన గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్

27-01-2021 Wed 13:09
  • వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చ‌
  • దిశానిర్దేశం చేయ‌నున్న నిమ్మ‌గ‌డ్డ‌
  • హాజ‌రైన‌ కలెక్టర్లు, ఎస్పీలు,  పంచాయతీ అధికారులు
nimmagadda meeting with ap cs dgp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చ‌ర్చించిన‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వ‌ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌డానికి ప్ర‌భుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఈ సమావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శి,  డీజీపీతో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ కూడా హాజ‌ర‌య్యారు. అలాగే, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు ఇందులో పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు అధికారుల‌నూ బ‌దిలీ చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రు కూడా ఈ సమావేశానికి హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 29 నుంచి  పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.