క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న క‌మ‌ల హ్యారిస్‌!

27-01-2021 Wed 12:18
  • ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు వ్యాక్సిన్ తీసుకున్న క‌మ‌ల
  • గ‌త నెల మొద‌టి డోసు  
  • ప్ర‌జ‌ల‌ జీవితాల‌ను వ్యాక్సిన్ ర‌క్షిస్తుంద‌ని వ్యాఖ్య‌
Kamala Harris Receives Her Second Dose

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌జ‌లంద‌రూ వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్స‌హిస్తూ గ‌త నెల 29న అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌ల హ్యారిస్‌ వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఈ రోజు రెండ‌వ డోసు తీసుకున్నారు.

త‌మ దేశ ప్ర‌జ‌లంతా వ్యాక్సి‌న్లు వేయించుకోవాల‌ని ఈ సందర్భంగా ఆమె సందేశ‌మిచ్చారు. ఆమె మోడెర్నా వ్యాక్సిన్ వేయించుకుంటుండ‌గా టీవీల్లో లైవ్ లో ప్ర‌సారం చేశారు. టీకా ప్ర‌జ‌ల‌ జీవితాల‌ను ర‌క్షిస్తుంద‌ని ఆమె చెప్పారు. కాగా, వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌తపై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా వాటిపై న‌మ్మ‌కాన్ని పెంచ‌డానికి ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా వ్యాక్సిన్లు వేయించుకున్నారు.  

ప్ర‌స్తుతం అమెరికాలో మోడెర్నాతో పాటు పైజ‌ర్ వ్యాక్సిన్ల‌ను ప్ర‌జ‌ల‌కు వేస్తున్నారు. త‌న 100 రోజుల పాల‌న పూర్తయ్యేలోగా అమెరికాలో సుమారు ప‌ది కోట్ల మందికి వ్యాక్సిన్లు వేస్తామ‌ని అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు.