Pavitra: శ్రీలంక మంత్రిని కరోనా నుంచి కాపాడలేకపోయిన మ్యాజిక్ సిరప్!

  • శ్రీలంక ఆరోగ్య మంత్రిగా ఉన్న పవిత్ర
  • నెల క్రితం మ్యాజిక్ సిరప్ తీసుకున్న పవిత్ర
  • ఆపై సోకిన కరోనా మహమ్మారి
Sri Lanka Minister Who Take Mantra Jalam for Corona Gets Virus

ఆమె పేరు పవిత్ర వినియరాచ్చి... శ్రీలంకలో ఆరోగ్య శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి. ఇటీవల ఆమె కరోనా రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని చెబుతూ, ఓ మ్యాజిక్ సిరప్ (మహిమగల పానకం) తీసుకున్నారు. ఈ విషయం పత్రికలు, టీవీల్లో పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు దీని కోసం ఎగబడ్డారు. మహిమగల సిరప్ గా దీని తయారీదారులు చెప్పుకోవడంతో దీనికి ఎనలేని డిమాండ్ వచ్చింది. ఈ ఘటన దాదాపు నెల రోజుల క్రితం జరిగింది.

అంతవరకూ బాగానే ఉంది. తాజాగా, పవిత్ర అనారోగ్యం బారిన పడటంతో, అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు కొవిడ్ మహమ్మారి సోకినట్టుగా నిర్ధారణ అయింది. ఆ వెంటనే ఈమెపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ మొదలైంది. మీరు తాగిన మ్యాజిక్ సిరప్ పని చేయలేనట్టుంది? అంటూ సెటైర్లు మొదలయ్యాయి. ప్రజల్లో టీకాపై అవగాహన పెంచాల్సిన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటంటూ ప్రపంచ వ్యాప్తంగానూ విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయంలో స్పందించని పవిత్ర, తనకు కరోనా సోకినట్టు అంగీకరిస్తూ, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని, తన ఆరోగ్యం బాగానే ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఏది ఏమైనా ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉండి, మూఢనమ్మకాలతో ఇటువంటి మ్యాజిక్ సిరప్ లను ప్రోత్సహించడం ఏమిటన్న  విమర్శలు తలెత్తుతున్నాయి.

More Telugu News