శ‌శిక‌ళ ఆరోగ్యం బాగానే ఉంది.. విడుద‌ల నేప‌థ్యంలో ఆసుప‌త్రి ప్ర‌క‌ట‌న‌

27-01-2021 Wed 10:59
  • అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ
  • కరోనాతో ఇటీవ‌ల ఆసుపత్రిలో చేరిన నాయ‌కురాలు
  • ప‌ల్స్ రేటు నిమిషానికి 76గా ఉంద‌న్న వైద్యులు
  • బీపీ 166/86గా ఉంద‌ని ప్ర‌క‌ట‌న‌
Sasikala is conscious alert and well oriented

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె శిక్షా కాలం ముగియ‌డంతో ఈ రోజు విడుదల చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో, కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆమె ప‌రిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుద‌ల చేశారు.

శ‌శిక‌ళ‌ ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని, ఆమె ప‌ల్స్ రేటు నిమిషానికి 76గా, బీపీ 166/86గా ఉన్నాయని బెంగ‌ళూరు మెడిక‌ల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ప్ర‌క‌టించారు. దీంతో ఆమె ఈ రోజు ఆసుప‌త్రి నుంచి ఇంటికి చేరుకునే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఆమెను అధికారులు విడుద‌ల చేసిన అనంత‌రం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాల‌ని ఆమె బంధువులు భావిస్తున్నారు. మ‌రోవైపు, ఇంటి వ‌ద్దే చికిత్స అందిస్తార‌న్న ప్ర‌చారమూ జ‌రుగుతోంది.