2020 బెస్ట్ మెమొరీ ఏంటని ప్రశ్నించగా... ఫోటో చూపించిన సమంత!

27-01-2021 Wed 10:29
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలు
  • రానా వివాహం అత్యంత మధుర జ్ఞాపకమని వెల్లడి
  • పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సమంత
Samantha Best Memory in 2020

వివాహమైన తరువాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ, తనకు వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, సాధ్యమైనన్ని ఎక్కువ అప్ డేట్స్ ఇస్తుండే సమంత, తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొని, తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. నిన్న తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో జవాబులు పోస్ట్ చేసింది.

'మీకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏమనుకునేవారు?' అన్న ప్రశ్నకు ఇంకా ఎదగాలన్న తాపత్రయం తప్ప ఇంకేముంటుందని ఎదురు ప్రశ్నించింది సమంత. అదే సమయంలో '2020లో మీ బెస్ట్ మెమొరీ ఏంటి?' అని ప్రశ్నించగా, రానా వివాహం చేసుకున్నప్పటి చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో రానా, మిహికాలతో పాటు సమంత సహా అక్కినేని ఫ్యామిలీలోని చాలా మంది కనిపిస్తున్నారు.

ఇక సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు, ట్రోలింగ్ వల్ల ఒకప్పుడు చాలా బాధ పడ్డానని, ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపానని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మాత్రం ట్రోలింగ్ గురించి వింటే నవ్వొస్తుందని చెప్పింది. ఎదుటి వారు విమర్శిస్తున్నారంటే, మనం మరింత ఎత్తునకు ఎదిగామని అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.