Acharya: మెగా ఫ్యాన్స్ సస్పెన్స్ కు తెరదించిన కొరటాల శివ... టీజర్ విడుదల తేదీ ప్రకటన!

Koratala Announces Acharya Teaser Date and Time
  • 29, సాయంత్రం 4.05 గంటలు
  • ధర్మస్థలి గేట్లు తెరుస్తున్నాం
  • టీజర్ విడుదలపై కొరటాల వీడియో
నిన్న హామీ ఇచ్చినట్టుగానే దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటున్న 'ఆచార్య'కు సంబంధించి బిగ్ అప్ డేట్ ను ప్రకటించి, మెగా ఫ్యాన్స్ లోని సస్పెన్స్ కు తెరదించారు. ఈ చిత్రం టీజర్ ను 29వ తేదీన సాయంత్రం 4.05కు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

ఈ మేరకు ఓ చిన్న వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. "గౌరవనీయులైన చిరంజీవి సార్ కు... ధర్మస్థలి డోర్లు జనవరి 29, సాయంత్రం 4.05 గంటలకు తెరచుకోబడతాయి" అంటూ టీజర్ ప్రకటన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. కొరటాల శివ నుంచి ఈ పోస్ట్ వచ్చీ రాగానే వైరల్ అయింది.

ఇక ఈ చిన్న వీడియోలో, చిరంజీవి తన అత్యుత్తమ నటనతో మరోసారి సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారని, మహమ్మారి రూపంలో ఎన్నో అడ్డంకులు రాగా, సుదీర్ఘ విరామం తరువాత తిరిగి షూటింగ్ ను ప్రారంభించామని, నిబద్ధతతో పనిచేసిన యూనిట్, విశ్రాంతి లేకుండా శ్రమించిన కార్మికుల కారణంగానే ఇది సాధ్యమైందని అన్నారు. అతి త్వరలోనే తాము పడ్డ కష్టం ఎటువంటిదన్న విషయాన్ని అభిమానులు చూస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచేలా టీజర్ ఉంటుందని కొరటాల స్పష్టం చేశారు.

Acharya
Dharmasthali
Teaser
Koratala Siva
Twitter

More Telugu News