శశికళకు భద్రత కల్పించండి: కేంద్ర హోంశాఖకు ఆమె లాయర్ లేఖ

27-01-2021 Wed 09:25
  • కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన రాజరాజన్ 
  • నేటితో ముగియనున్న శశికళ నాలుగేళ్ల శిక్ష
  • విడుదల అనంతరం చెన్నైలోని మేనకోడలి ఇంటికి
Sasikala lawyer sought e zplus security

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ నేడు విడుదల కానున్నారు. కరోనాతో ఆసపత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆమె విడుదలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తిచేయాలని జైలు అధికారులు భావిస్తున్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తయిన ఆమె నేడు విడుదలైనప్పటికీ మరో పది రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.

శశికళ విడుదల నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది రాజరాజన్ కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తూ..శశికళకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరారు. జైలు నుంచి విడుదలయ్యాక శశికళ చెన్నైలోని తన సోదరుడి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో ఉంటారని, ఆమెకు భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు.