సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

27-01-2021 Wed 07:20
  • 'సలార్'లో శ్రుతిహాసన్ కు ఛాన్స్?
  • ఈ 29న 'మాస్టర్' డిజిటల్ ప్రీమియర్
  • 'క్రాక్' హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్      
Shruti Hassan opposite Prabhas in Salaar

*  అందాలతార శ్రుతిహాసన్ కు ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం శ్రుతిహాసన్ కు వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
*  తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' చిత్రం ఈ నెల 9న విడుదలై, తెలుగు, తమిళ భాషల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.  
*  రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించే అవకాశం కనిపిస్తోంది. ఆమధ్య 'అర్జున్ రెడ్డి' చిత్రం రీమేక్ లో నటించిన షాహిద్.. ప్రస్తుతం 'జెర్సీ' చిత్రం హిందీ  రీమేక్ లో కూడా నటిస్తుండడం గమనార్హం.