తాజా మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' రిలీజ్ డేట్

26-01-2021 Tue 22:03
  • సుబ్బు దర్శకత్వంలో 'ఉప్పెన' 
  • కరోనా వల్ల విడుదలలో జాప్యం
  • చివరికి థియేటర్లలోనే విడుదల  
  • ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు 
Vaishnav Tej Uppena film release date confirmed

మెగా ఫ్యామిలీ  నుంచి వస్తున్న తాజా హీరో వైష్ణవ్ తేజ్. చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సివుంది. అయితే, కరోనా దెబ్బకు మొన్నటివరకు థియేటర్లు మూతబడడంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యం జరిగింది. ఆ సమయంలో దీనిని ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, ఇది వైష్ణవ్ తొలిసినిమా కావడంతో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఈ రోజు ప్రకటించారు. ఇందులో కృతిశెట్టి కథానాయికగా నటించగా.. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. ముఖ్యంగా 'నీ కన్ను నీలి సముద్రం..' అంటూ సాగే పాట అయితే సూపర్ హిట్టయింది.