కోహ్లీయే నా కెప్టెన్, నేను అతడికి డిప్యూటీని... ఇద్దరి మధ్య మార్పేంలేదు: రహానే

26-01-2021 Tue 21:40
  • కోహ్లీ గైర్హాజరీలో ఆసీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర
  • జట్టును విజయపథంలో నడిపిన రహానే
  • కోహ్లీ లేనప్పుడే నేను సారథిని అంటూ వినమ్రంగా చెప్పిన రహానే
  • ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని వెల్లడి
Rahane says Kohli is his captain

ఇటీవల ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాను విజయపథంలో నడిపించిన అజింక్యా రహానే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సారథ్యంలో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెల్చినా, జట్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీయేనని, అందులో ఎలాంటి వివాదానికి తావులేదని స్పష్టం చేశాడు.

కోహ్లీయే నా కెప్టెన్... నేనతడికి డిప్యూటీని... ఇద్దరి మధ్య ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు. కోహ్లీ లేనప్పుడు అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకోవడం తన విధి అని వివరించాడు. జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిపోరాడడం తన కర్తవ్యం అని పేర్కొన్నాడు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు. ఇంగ్లాండ్ తో టీమిండియా ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుండగా, కోహ్లీ నాయకత్వంలో జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఎప్పట్లానే రహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.