Andhra Pradesh: ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రోత్సాహక మొత్తాన్ని పెంచిన ఏపీ సర్కారు

  • ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • ఇప్పుడందరి దృష్టి నామినేషన్ల పైనే!
  • జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు
  • జీవో జారీ చేసిన ప్రభుత్వం
AP Government announced incentives for unanimous panchayats

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి నామినేషన్లపై పడింది. ఈ క్రమంలో ఏపీ సర్కారు ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో జారీ చేసింది. పంచాయతీ జనాభాను బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 2 వేల లోపు జనాభా ఉంటే రూ.5 లక్షలు, 5 వేల వరకు జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల వరకు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేల జనాభా దాటితే రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

More Telugu News