ఢిల్లీ రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల చేసిన పోలీసులు

26-01-2021 Tue 20:31
  • ఢిల్లీలో రైతు ఆందోళనలు
  • ఐటీవో వద్ద రైతు మృతి
  • పోలీసులే కారణమన్న రైతులు
  • ట్రాక్టర్ పల్టీ కొట్టి మృతి చెందాడన్న పోలీసులు
  • అందుకు రుజువుగా వీడియో ఫుటేజి విడుదల
Police released cc tv footage of farmer death in Delhi

ఢిల్లీలో ఇవాళ రైతుల ఆందోళన సందర్భంగా ఓ రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసుల బుల్లెట్ తగిలి అతడు మృతి చెందాడని రైతులు ఆరోపిస్తుండగా, ట్రాక్టర్ పైనుంచి పడి ఆ రైతు మృతి చెందాడని పోలీసులు అంటున్నారు. తాజాగా, ఢిల్లీ పోలీసులు ఆ రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల చేశారు. ట్రాక్టర్ పల్టీ కొట్టిన కారణంగానే ఆ రైతు మరణించినట్టు ఆ వీడియో ఫుటేజి ద్వారా పోలీసులు వెల్లడించారు. అతివేగంగా బారికేడ్ల వైపు దూసుకొచ్చిన ఆ ట్రాక్టర్ బోల్తాపడినట్టు తేలింది. కాగా, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ ముగియడంతో రైతులు తమ ట్రాక్టర్లతో సహా తిరిగి ఘజియాపూర్ చేరుకున్నారు.