Mobile Fish Outlets: మహిళల ఉపాధికి కొత్త పథకం... తెలంగాణలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు

  • చేపలు, చేపల వంటకాల విక్రయాలకు సంచార వాహనాలు
  • నేరుగా వినియోగదారుడి వద్దకే తాజా చేపలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో పంపిణీకి సన్నాహాలు
  • 60 శాతం సబ్సిడీతో వాహనాల అందజేత
Mobile fish outlets in GHMC region

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం కొత్త పథకం తీసుకువచ్చింది. చేపలు, చేపలతో వంటకాల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందించనున్నారు. ఈ వాహనం ఖరీదు రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో అందజేయనుంది.

 దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతో పాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు లబ్దిపొందేలా చేయడమే ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.

More Telugu News