రవితేజ సరసన 'గ్యాంగ్ లీడర్' భామ

26-01-2021 Tue 16:32
  • 'గ్యాంగ్ లీడర్'తో టాలీవుడ్ కి పరిచయం 
  • ప్రస్తుతం 'శ్రీకారం' సినిమాలో ప్రియాంక
  • త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ
  • 'ఖిలాడి' తర్వాత మొదలయ్యే చిత్రం  
Priyanka Arul Mohan opposite Raviteja

ఇటీవలి కాలంలో తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయికల్లో ప్రియాంక అరుల్ మోహన్ కూడా వుంది. చెన్నైకి చెందిన ఈ కోలీవుడ్ భామ నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'శ్రీకారం' సినిమాలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా రవితేజ సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది.

తాజాగా 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇంతకుముందు 'సినిమా చూపిస్త మావా', 'నేను లోకల్' సినిమాలతో వినోదాత్మక కథా చిత్రాల దర్శకుడిగా త్రినాథరావు పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు రవితేజతో ఆయన ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశాడు. ఇందులో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.