63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లికి సిద్ధమైన వృద్ధుడు!

26-01-2021 Tue 16:06
  • గుజరాత్ లో ఘటన
  • గతేడాది ఆరో భార్యను పెళ్లాడిన వృద్ధ రైతు
  • శృంగారానికి ఒప్పుకోవడంలేదని ఆరోపణ
  • అందుకే మరో పెళ్లి చేసుకుంటున్నానని వెల్లడి
Old man set to marry seventh time

గుజరాత్ లో ఓ రైతు ఇప్పటివరకు ఆరు పెళ్లిళ్లు చేసుకుని, తాజాగా ఏడో పెళ్లికి సిద్ధం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సూరత్ ప్రాంతానికి చెందిన ఆ రైతు పేరు అయూబ్ దెగియా. వయసు 63 ఏళ్లు. గతేడాది తనకంటే బాగా చిన్నవయసున్న మహిళను పెళ్లాడిన అయూబ్ ఇప్పుడు మరో పెళ్లి కోసం ఉరకలేస్తున్నాడు. ఏడో పెళ్లికి ఆ వృద్ధుడు చెబుతున్న కారణం వింటే ఆశ్చర్యపోతారు.

తన ఆరో భార్య శృంగారానికి అంగీకరించడంలేదని ఆరోపిస్తున్నాడు. తాను మధుమేహం, హృద్రోగం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అయితే తనను జబ్బుల నుంచి బయటపడేసేది శృంగారమేనని అయూబ్ నమ్ముతున్నాడు. శృంగారానికి ఒప్పుకోని భార్యతో తాను కాపురం చేయలేనని, అందుకే మరో పెళ్లి చేసుకుంటున్నానని తెలిపాడు.

అయూబ్ మొదటి భార్య, ఐదుగురు పిల్లలు ఇప్పటికీ అదే గ్రామంలో ఉంటున్నారట. అతడి పిల్లలందరూ పెళ్లీడుకు వచ్చినవారే. పిల్లలకు పెళ్లి చేయాల్సిన వాడు తానే పెళ్లికొడుకు అవతారం ఎత్తుతుండడం విస్తుగొలుపుతోంది. కాగా, ఈ వృద్ధ నిత్యపెళ్లికొడుకు గతంలో ఐదు వివాహాలు చేసుకున్న సంగతి ఆరో భార్యకు తెలియదట. ఇటీవలే ఆ విషయం తెలియడంతో అయూబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.