'ఆర్ఆర్ఆర్' ఓవర్సీస్ రేటు అదిరింది!

26-01-2021 Tue 14:01
  • టాలీవుడ్ భారీ చిత్రాలలో 'ఆర్ఆర్ఆర్'  
  • ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇప్పటికే రికార్డు  
  • 68 కోట్లకు ఓవర్సీస్ హక్కుల అమ్మకం
  • అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్
RRR oversees rights sold for a huge amount

టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణంలో వున్న భారీ చిత్రాలలో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రం భారీ బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటోంది. భారీ తారాగణం .. అత్యున్నత సాంకేతిక విలువలు.. అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి ఉండడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఇప్పటికే ఈ చిత్రం పలు ఏరియాలలో రికార్డు రేట్లకు అమ్ముడుపోయినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ కూడా రికార్డు ధరకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్ల ఓవర్సీస్ ప్రదర్శన హక్కులను ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం సదరు సంస్థ సుమారు 68 కోట్లను వెచ్చించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే!