ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ 'సిక్సర్'

26-01-2021 Tue 14:00
  • ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ కు 6 మిలియన్ల మంది ఫాలోవర్లు
  • కొద్దికాలంలోనే భారీగా ఫాలోవర్లు
  • అరుదుగా పోస్టులు చేసే ప్రభాస్
  • ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండకు 10.4 మిలియన్ల మంది
Prabhas gets six million followers in Instagram

బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి చేరిన ప్రభాస్... ఫాలోయింగ్ పరంగానూ దూసుకెళుతున్నాడు. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవుతున్నవారి సంఖ్య తాజాగా 6 మిలియన్లకు చేరింది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చాలా కొద్ది సమయంలోనే ఫ్రభాస్ ఇంత భారీగా ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు.

మిగతా హీరోలతో పోల్చితే ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం తక్కువే అయినా, ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉండడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా హై బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.

ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా అరుదు. తన సినిమా అప్ డేట్ల గురించి అప్పుడప్పుడు స్పందిస్తుంటాడు. కాగా, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయానికొస్తే... టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ 10.4 మిలియన్ల ఫాలోవర్లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో అల్లు అర్జున్ (10.2 మిలియన్లు), మహేశ్ బాబు (6.4 మిలియన్లు) ఉన్నారు.