'క్రాక్' సినిమా దర్శకుడికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!

26-01-2021 Tue 12:59
  • 'క్రాక్'తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని 
  • స్టార్ హీరోల నుంచి వస్తున్న ఆఫర్లు
  • గోపీచంద్ కథకు ఓకే చెప్పిన బాలయ్య
  • బోయపాటి సినిమా తర్వాత సెట్స్ కు
Balakrishna gives nod to Gopichand

రవితేజ కథానాయకుడుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' సినిమా మంచి హిట్టయింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఇది బాగా ఆకట్టుకోవడంతో సినిమా పెద్ద హిట్టయింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు గోపీచంద్ కు పలు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ నుంచి కూడా గోపీచంద్ కు ఆఫర్ వచ్చింది. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ కథను తాజాగా ఆయనకు చెప్పాడనీ, బాగా నచ్చడంతో వెంటనే బాలయ్య ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఇది పూర్తికాగానే గోపీచంద్ సినిమా మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.