జనసేనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: నాదెండ్ల‌

26-01-2021 Tue 10:39
  • ఎన్నికల్లో బీజేపీతో కలిసి పార్టీ పోటీ చేస్తుంది
  • తిరుపతి ఉప‌ ఎన్నికపై పూర్తి అవగాహనతో ఉన్నాం
  • జనసేన పార్టీని తక్కువగా అంచనా వేయొద్దు
we will contest with alliance says nadendla

దేశ వ్యాప్తంగా 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు కొన‌సాగుతున్నాయి. ఏపీలో రాజ‌కీయ నాయ‌కులు త‌మ తమ పార్టీల కార్యాల‌యాల వ‌ద్ద‌ జాతీయ జెండాను ఎగుర‌వేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... వచ్చే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో బీజేపీతో కలిసి త‌మ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ తిరుపతి ఉప‌ ఎన్నికపై త‌మ పార్టీ పోటీ చేయ‌డంపై కూడా పూర్తి అవగాహనతో ఉందని ఆయ‌న  తెలిపారు. త‌మ పార్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వ‌దంతులు సృష్టించ‌డం స‌రికాద‌ని అన్నారు. అలాగే, ఏపీలో బ‌లాన్ని పుంజుకుంటోన్న‌ జనసేన పార్టీని తక్కువగా అంచనా వేయొద్దని చెప్పారు.