విజయవాడలో గణతంత్ర వేడుకలు... పాల్గొన్న గవర్నర్, సీఎం!

26-01-2021 Tue 09:50
  • ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వేడుకలు
  • పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
  • పాల్గొన్న మంత్రులు, సీఎస్, డీజీపీ
Governer Flag Hoisting in Vijayawada

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆపై గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో భాగంగా పరేడ్ చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 14 శకటాలు ప్రజలను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు చీఫ్ సెక్రెటరీ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.