సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-01-2021 Tue 07:34
  • అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో ఊర్వశి  
  • శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్
  • 'క్రాక్' డిజిటల్ ప్రీమియర్ వాయిదా  
Urvasi Routela shakes a leg with Allu Arjun

*  బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా త్వరలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడనుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో ఐటం సాంగు కోసం ఊర్వశిని తీసుకున్నట్టు తెలుస్తోంది.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో నాగ చైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు.
*  రవితేజ హీరోగా సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' చిత్రం డిజిటల్ హక్కులను 'ఆహా' ఓటీటీ సంస్థ తీసుకుంది. ఈ చిత్రం ప్రీమియర్ ను ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయాలని మొదట్లో నిర్ణయించారు. అయితే, థియేటర్లలో ఇంకా మంచి కలెక్షన్లతో నడుస్తున్నందున డిజిటల్ ప్రీమియర్ ను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.