కశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

26-01-2021 Tue 06:53
  • పంజాబ్ నుంచి బయలుదేరిన ధ్రువ్
  • కథువా సమీపంలో క్రాష్ ల్యాండింగ్
  • పైలట్ దుర్మరణం
Army Chopper Crash Land near Khathuva

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోగా, దాన్ని నడుపుతున్న పైలట్ దుర్మరణం పాలయ్యాడు. ఈ చాపర్ అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ 'ధ్రువ' వేరియంట్ కు చెందినదని అధికారులు వెల్లడించారు. ఇది పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరిందని, కథువాకు సమీపంలోని లఖన్ పూర్ లో క్రాష్ ల్యాండింగ్ అయిందని తెలిపారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో పైలట్ ను స్థానిక సైనిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ శైలేంద్ర మిశ్రా వెల్లడించారు. ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయమై విచారణ జరుగుతోందని తెలిపారు.