సాయితేజ్ కొత్త సినిమా 'రిపబ్లిక్' మోషన్ పోస్టర్ ఇదిగో!

25-01-2021 Mon 21:57
  • దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్
  • సాయితేజ్ వాయిస్ ఓవర్ తో మోషన్ పోస్టర్
  • వేసవిలో విడుదల కానున్న చిత్రం
  • సాయితేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్
Republic motion poster released
మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న కొత్త చిత్రం 'రిపబ్లిక్'. దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇవాళ రిలీజైంది. ఇందులో సాయితేజ్ గొంతుకలో వినిపించిన డైలాగ్ ను పొందుపరిచారు. రిపబ్లిక్ అంటే ఏమిటి? అనేదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు.

ఈ సినిమాలో సాయితేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తోంది. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తర్వాత సాయితేజ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 'రిపబ్లిక్' చిత్రాన్ని జేబీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.