బాలీవుడ్ సినిమాలో అక్కినేని నాగ చైతన్య?
- ఆమిర్ ఖాన్ హీరోగా 'లాల్ సింగ్ చద్దా'
- కీలక పాత్రకు ఓకే చెప్పిన నాగ చైతన్య
- తన షూటింగ్ పూర్తిచేసిన కరీనా కపూర్
- హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్
అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ హీరోగా 'లాల్ సింగ్ చద్దా' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. 1994లో హాలీవుడ్ లో వచ్చిన ఆస్కార్ అవార్డు చిత్రం 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ఓ కీలక పాత్రకు గాను నాగ చైతన్యను ఆ సినిమా యూనిట్ సంప్రదించిందనీ, చైతు దీనికి ఓకే చెప్పేశాడనీ అంటున్నారు.
ఇక, ఇందులో కథానాయికగా కరీనా కపూర్ నటిస్తోంది. ఆమె పాత్ర చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. మరోపక్క, ఇందులో ఓ కీలక పాత్రకు ఎంపికైన తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. డేట్స్ సమస్య వల్ల అతను చేయడం లేదని అంటున్నప్పటికీ, ఆమిర్ తో అభిప్రాయ భేదాల కారణంగానే ప్రాజక్టు నుంచి తప్పుకున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది.