Devineni Uma: రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోంది: దేవినేని ఉమ‌ విమర్శలు

  • నామినేషన్లు స్వీక‌రించ‌డానికి అధికారులు లేరు  
  • వెంట‌నే రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ స్పందించాలి
  • ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వ‌హించేలా చేయాలి
devineni uma slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు ఆరోపించారు. టీడీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌డానికి వెళ్లారని, వాటిని స్వీక‌రించ‌డానికి అధికారులు లేరని దేవినేని ఉమ అన్నారు. దీనిపై వెంట‌నే రాష్ట్ర‌ప‌తి‌, గ‌వ‌ర్న‌ర్ లు స్పందించాలని కోరారు. స్థానిక సంస్థ ఎన్నిక‌లు ఎలాంటి ఆటంకాలు లేకుండా స‌క్ర‌మంగా నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు.

కాగా, ఏపీలో పెరిగిపోతోన్న పెట్రో ధ‌ర‌ల‌పై కూడా దేవినేని ఉమ స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'పెట్రోల్, డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్.. దేశంలో మూడోస్థానం. అదనపు వ్యాట్, రోడ్ల పన్నులంటూ భారీగావడ్డింపు, సీఎన్జీనీ వదలని వైనం. చంద్ర‌బాబు నాయుడి హయాంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఏపీని నేడు అప్పుల్లోకి తెచ్చారు. పన్నులు వేయడంలో అగ్రగామిగా నిలిపారు. దీంతో దేశం మొత్తం మనవైపు చూసేలా చేసినమాట వాస్తవంకాదా?' అని దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.

More Telugu News