Pawan Kalyan: హైదరాబాదులో పవన్, రానా చిత్రం షూటింగ్ ప్రారంభం

Pawan Kalyan and Rana starring new movie shoot begins
  • 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి తెలుగు రీమేక్
  • సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సినిమా
  • ప్రధానపాత్రల్లో పవన్ కల్యాణ్, రానా
  • హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ
తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సెట్ పైనే ఈ చిత్రం నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు, హీరో పవన్ కల్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు.

కేరళలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర తారాగణం పేర్లు ప్రకటించాల్సి ఉంది. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్, రానా కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి బిల్లా-రంగా అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Pawan Kalyan
Rana Daggubati
Shooting
Hyderabad
Tollywood

More Telugu News